తెలుగు అక్షరాలు | |||||||
![]() | |||||||
Monday, November 1, 2010
తెలుగు నుంబెర్స్
Telugu Numbers
Below are the list of Telugu Numbers and their pronunciations to help you to learn Telugu language easily.
Below are the list of Telugu Numbers and their pronunciations to help you to learn Telugu language easily.
- 0
- zero (sunna) - సున్న
- 1
- one (OkaTi) - ఒకటి
- 2
- two (renDu)
- 3
- three (mooDu)
- 4
- four (naalugu)
- 5
- five (aidu)
- 6
- six (aaru)
- 7
- seven (ehDu)
- 8
- eight (enimidi)
- 9
- nine (tommidi)
- 10
- ten (padhi)
- 11
- eleven (padakondu)
- 12
- twelve (pannendu)
- 13
- thirteen (padamudu)
- 14
- fourteen (padnalugu)
- 15
- fifteen (padihenu)
- 16
- sixteen (padaharu)
- 17
- seventeen (padihedu)
- 18
- eighteen (paddenimidi)
- 19
- nineteen (panthommidi)
- 20
- twenty (eruvadi)
- 20(informal)
- twenty (eravai)
- 21
- twenty one (eruvadi okati)
- 22
- twenty two (eruvadi rendu)
- 23
- twenty three (eruvadi moodu)
- 24
- twenty four (eruvadi naalugu)
- 25
- twenty five (eruvadi aidu)
- 30
- thirty (muppai)
- 40
- forty (nalabai)
- 50
- fifty (Yabhai)
- 60
- sixty (aaravi)
- 70
- seventy (dabbai)
- 80
- eighty (enabai)
- 90
- ninety (thombai)
- 100
- one hundred (vanda)
- 200
- two hundred (rendu vandalu)
- 300
- three hundred (moodu vandalu)
- 1000
- one thousand (veyyi)
- 2000
- two thousand (rendu velu)
- 100,000
- hundred thousands (laksha)
- 1,000,000
- one million (padi lakshalu)
- 10,000,000
- ten millions (koti)
- 1,000,000,000
- one thousand million in UK, one billion in USA (vanda kotlu)
- 1,000,000,000,000
- one billion in UK, one trillion in USA (Laksha kotlu)
ఇతర రాష్ట్రాలలో తెలుగు
తెలుగు దక్షిణ భారతదేశ0లోని ఆ0ధ్రప్రదేశ్ లోనే కాకు0డా తమిళనాడు, కర్నాటక లలో కూడా మాట్లాడబడుతు0ది.తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాత0 తెలుగువారే. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణ0గా ఆప్రా0త మాతృ భాషయిన తమిళ0లోనే మాట్లాడుతు0టారు. అలాగే కర్నాటక లో కూడా చాలామ0ది తెలుగు మాట్లాడగలరు.ఇ0కా ఒడిషా, చత్తీష్ఘడ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రా0తాలలోని ప్రజలు అధిక0గా తెలుగే మాట్లాడుతారు.ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురి0చి ప్రత్యేక0గా చెప్పనక్కరలేదు.
తెలుగు సాహిత్యం
- ప్రధాన వ్యాసం: తెలుగు సాహిత్యము
క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.1020-1400 - పురాణ యుగము
దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )
ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.
1510-1600 - ప్రబంధ యుగము
విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.1600-1820 - దాక్షిణాత్య యుగము
కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.1820 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.- గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.
19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
లిపి
- ప్రధాన వ్యాసము
- తెలుగు లిపి
ఈ లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.

తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
మాండలికాలు
ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి, కమ్మర , కామాటి, కాశికాపిడిమేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒరిస్సా(బడగ )--1961 సెన్సస్, బంజారా[లంబాడి], , కొడువ,
భాష స్వరూపము
శబ్దము
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
/a/ | /ɑː/ | /ɪ/ | /iː/ | /u/ | /uː/ | /ru/ | /ruː/ | /lu/ | /luː/ | /e/ | /eː/ | /ai/ | /o/ | /oː/ | /au/ | /am/ | /aha/ |
Subscribe to:
Posts (Atom)